Home  »  Bollywood News  »  ప్రధాని మోదీపై లెజండ్రీ నటీమణి షబానా ఆజ్మీ వ్యాఖ్యలు వైరల్ 

Updated : Jul 20, 2026

 


భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే నటి షబానా ఆజ్మీ. హీరోయిన్ గా  ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో రకాల క్యారెక్టర్స్ ని అత్యద్భుతంగా పోషించి నేటికీ మోస్ట్ వాల్యుబుల్ నటిగా నీరాజనాలు అందుకుంటుంది. ఢిల్లీ వేదికగా దేశ రాజధానిలో విద్యార్థులు చేస్తున్న పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యావ్యవస్థలో అక్రమాలకి వ్యతిరేకంగా విద్యార్థులు మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ విద్యార్థి లోకం కదం తొక్కుతోంది. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ విద్యార్థుల ఉద్యమానికి బాలీవుడ్ సీనియర్ నటి, మాజీ రాజ్యసభ ఎంపీ షబానా ఆజ్మీ నేరుగా రోడ్డుపైకి వచ్చి తన సంపూర్ణ మద్దతుని ప్రకటించడం పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 75 ఏళ్ల వయసులో ఉన్న ఆమె, జంతర్ మంతర్ నిరసన వేదికపై ప్రత్యక్షంగా పాల్గొని విద్యార్థుల పక్షాన నిలిచారు. ఈ సందర్భంగా షబానా ఆజ్మీ మీడియాతో మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోయినప్పుడే నేను స్పందిస్తాను. సాధారణంగా ప్రతి చిన్న విషయానికి మాట్లాడే వ్యక్తిని కాను. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఈ ఘోర అన్యాయం నన్ను తీవ్రంగా కలచివేసింది. అందుకే  గొంతు విప్పాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో భాగంగా తాము ముందుగా శాంతియుత చర్చల కోసం ప్రయత్నించామని ఆమె ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. 


Also read: Ntr: వెలుగులోకి ఎన్టీఆర్ సరికొత్త భోజనం అలవాట్లు.. కానీ సికింద్రాబాద్ లో దొరికే ఆ ఐటెం అంటే! 

విద్యార్థుల సమస్యను పరిష్కరించడానికి, ఒక సామరస్యపూర్వకమైన చర్చను (డైలాగ్‌ను) ప్రారంభించాలని కోరుతూ నేను నా భర్త, జావేద్ అఖ్తర్ స్వయంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాసినట్లు వెల్లడించారు. తాము మాజీ రాజ్యసభ సభ్యుల హోదాలోనే ఈ లేఖను పంపామని, దీనిని మీడియాకు రచ్చ చేసి పబ్లిక్ మ్యాటర్‌గా మార్చాలని అనుకోలేదని వివరించారు.  లేఖ పంపిన సమయంలో, రెండు రోజుల్లోనే ప్రధాని కార్యాలయం నుండి సమాధానం వస్తుందని తమకు మొదట అక్నాలెడ్జ్‌మెంట్ అందిందని శబానా అజ్మీ పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత రెండు రోజులు గడిచినా, మూడు రోజులు ఎదురుచూసినా, నాలుగు రోజులైనా ప్రధాని మోదీ నుంచి ఎలాంటి స్పందన గానీ, సమాధానం గానీ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి చొరవ లేకపోవడంతో, ఇక లాభం లేదని భావించి ఐదవ రోజున తామే నేరుగా రోడ్డుపైకి వచ్చి ఈ నిరసన దీక్షలో కూర్చోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, తాము మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలోనే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. మీడియా కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారా లేదా అనే అనవసరపు వివాదాలపై కాకుండా, నీట్ పరీక్షల అక్రమాలతో నష్టపోయిన లక్షలాది మంది విద్యార్థుల ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు. ప్రస్తుతానికి ఈ ఉద్యమానికి శబానా అజ్మీతో పాటు ప్రకాష్ రాజ్, పూనమ్ పాండే వంటి ప్రముఖులు మద్దతు తెలపగా, సోషల్ మీడియా ద్వారా నసీరుద్దీన్ షా, జీనత్ అమన్, సోనాక్షి సిన్హా వంటి ఎందరో బాలీవుడ్ తారలు బాసటగా నిలవడంతో ఈ పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. 

modi, shabana azmi, javed






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.